Aaradhyudu – ఆనంతుడు అధిసంభూతుడు

ఆనంతుడు అధిసంభూతుడు
అవనిపై అరుదించే ఈ వేళ
ఆరాద్యుడు అధిక స్తోత్రాహుడు
కన్య మరియ గర్భమున
జన్మించు ఈ వేళ ” 2 “
ఆ చిన్ని పాదాలు భువిని తాకగానే
భూలోకమంతా సంతోషించెను ” 2 “
మోకరించి ప్రణవిల్లి మ్రొక్కెదం
ఆ బాల యేసుని ఆ చిన్ని తండ్రిని ” 2 “
” ఆనంతుడు “

అమృత తుల్యమైన జీవము నొసగా
జీవధిపతిగా జన్మించాడు
సుస్పష్టమాయెను ఈ శుభ దినమున
లోక రక్షకుడు అరుదెంచెనని ” 2 “
సంబరమే సంతోషమే సకల జనులకు
సర్వోన్నతుడు సర్వము విడిచి
పశుల తొట్టెలో ” 2 “
పవళించే మనకై ఆశ్చర్యమే ” 2 “
” ఆనంతుడు “

నరుడు తాకలేని ఆ దివ్య రూపం
నర రూపమెత్తి నాకై వచ్చెను
చీకటి గుండెల్లో చిరు దివ్వెలు వెలిగించి ” 2 “
కాంతి కిరణమై ఉదయించెను ” 2 “
సంబరమే సంతోషమే సకల జనులకు
సర్వోన్నతుడు సర్వము విడిచి
పశుల తొట్టెలో ” 2 “
పవళించే మనకై ఆశ్చర్యమే ” 2 “

We will be happy to hear your thoughts

      Leave a reply