Meluleno Chesi Balaparachinaavaya song lyrics – మేలులేనో చేసి బలపరచిన్నావయా
Meluleno Chesi Balaparachinaavaya song lyrics – మేలులేనో చేసి బలపరచిన్నావయా
నూతన కార్యములు నాకై ఉద్దేశించి
నీ గొప్ప మేలులు నాకై దాచినావుగా
ఎన్నడూ చూడని సరికొత్త మార్గంలోకి
నీ గొప్ప సాక్షిగా మార్చినావయ్య
నా ఊహకే అందని గొప్ప కార్యములను చేసి
నా తలపులో చెరగని కృపలను ఇచ్చితివి
మేలులెన్నో చేసి బలపరిచినావయ్యా
మా తోడుగా నిలచి రక్షించినావయ్యా
గడచిన కాలమంతా నీ కృపలో దాచి
బలపరిచినావా యేసయ్య
ఇమ్మానుయేలుడా యేసయ్య
1) గాఢాంధకారంలో అపాయపు మార్గములో
నా ముందు నడిచిన కాపరి
బలహీన సమయంలో కన్నీటి లోయలలో సహాయము చేసిన ఉపకారి
అపాయములే తప్పించినావు ప్రాణ సంకటములె విడిపించినావు
నీ దయను నీ కృపను నే ఏమని పాడగలను ( మేలులెన్నో )
2) నిరాశల వలయంలో నిర్జీవ సమయంలో నన్ను దర్శించిన సహకారి
మా ధీన బ్రతుకులలో నలిగిన స్థితిగతిలో మహిమతో నింపిన అధికారి
మహాశ్రమలే తప్పించినావు శోధనలు ఎన్నో విడిపించినావు
మీ దయను నీ కృపను నే ఏమని పాడగలను ( మేలులెన్నో )
3)నీ మహిమ ఐశ్వర్యం మా ప్రతి అవసరత తీర్చుచు ఉన్నది యేసయ్య
కార్యసాధకమైన నీ శక్తి చొప్పున జరిగించుచున్నది యేసయ్య
మా ఊహకే అందదు నీ కృప బలమైన కార్యములు జరిగించె నీ కృప
నీ దయను నీ కృపను నే ఏమని పాడగలను ( మేలులెన్నో )