
krupalanu thalanchuchu – కృపలను తలంచుచు ఆయుష్కాలమంత
కృపలను తలంచుచు ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్
1.మిమ్మును ముట్టిన వాడు నా కంటిపాపను
ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం నన్ను
2.రూపింపబడుచున్న ఏ ఆయుధం ఉండినను
నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభువు
3.కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో
నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు
4.సర్వోన్నతుడైన నా దేవునితో చేరి
సతతము తన కృప వెల్లడి చేయ స్తుతులతో నింపెను – ఇలలో
5.హల్లెలూయా ఆమెన్ నాకెంతో ఆనందమే
సీయోన్ నివాసము నాకెంతో ఆనందం ఆనందంమానందమే ఆమెన్