సంద్రంలో పడవ ప్రయాణం – Sandram Lo Padava Prayanam

సంద్రంలో పడవ ప్రయాణం – Sandram Lo Padava Prayanam

LYRICS
పల్లవి :
సంద్రంలో పడవ ప్రయాణం – బ్రతుకులోన భక్తి ప్రయాణం
తీరాన్ని చేరే గమనం పరమునకు చేర్చే గమ్యం
దరిచేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా
కృపచూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా ☆సంద్రంలో☆

చరణం1:
నడికడలిలో… నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నది
బ్రతుకు మధ్యలోనా… భక్తి ఉన్నది
హింసలతో అది కాస్తా వణుకుచున్నది
నడికడలిలో నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నది
బ్రతుకు మధ్యలో భక్తి పున్నది
హింసలతో కాస్తా వణుకుచున్నది
తీరం చేరాలన్నా నీ కృపయేకదా
అంతం వరకూ సహించే నీ చలువే కదా
కెరటాలతో జలము పడవలోకి చేరినట్లు
విశ్వాసంలో భాదలు అలుముకున్నవి
నాకున్న బలము సరిపోదయ్యా
నాకున్న శక్తి చాలనే చాలదయ్యా
బాహువు చేత గమ్యము చేర్చి
నీ శక్తి చేత కడముట్టించుమయ్యా ☆దరిచేర్చయ్యా☆

చరణం2:
విశ్వాసంలో ఓడ బ్రద్దలైనా
హుమెనైయును, అలెక్సంద్రు ఎందరో వున్నారు
సత్యవిషయమై అనుభవజ్ఞానం లేని
విశ్వాసమును చెరిపే యన్నే యంబ్రెలున్నారు
విశ్వాసంలో ఓడ బ్రద్దలై హుమెనైయును, అలెక్సంద్రు ఎందరో
సత్యవిషయమై అనుభవము లేని
విశ్వాసము చెరిపేవారు ఎందరో…
భక్తిహీనులనుండి నన్ను కాపాడి..
సత్యమార్గములో నన్ను నడిపించు నాదేవా
పెనుగాలిలాంటి ఆపదలెదురైనా…
మరణాలెన్నో సంభవించినా…
భక్తిలో నన్ను స్థిరముగా చేసి
మరణం వరకు తొట్రిల్నియ్యకయ్యా
అవమానాలు ఎన్నో ఎదురైన
భక్తుల మాదిరినా సాగిపోనియ్యుమయ్యా…
దరిచేర్చయ్యా యెహోవా
పరమునకు చేర్చుమయ్యా యెహోవా
కృపచూపయ్యా నా ప్రభువా
కాపాడుమయ్యా నా ప్రభువా… ☆సంద్రంలో☆

We will be happy to hear your thoughts

      Leave a reply