ఇంత గొప్ప ధన్యత – నా కిచ్చితివా దేవా – New Year Christian Song

Deal Score+3
Deal Score+3

ఇంత గొప్ప ధన్యత – నా కిచ్చితివా దేవా
ఎన్నతరమే కాదయ్యా – నీ ఉన్నతమౌ ప్రేమ
స్తుతి ఆరాధన నీకే – నిరతము చెల్లింతును
మహిమ ప్రభావము నీకే – యుగయుగములు కల్గునామెన్
నా యేసయ్యా నా ఆరాధ్యుడా – నీ నామమే నే స్మరియించెద
నా యేసయ్యా నా స్తుతిపాత్రుడా – నీ నామమే నే ఘనపరిచెద

పనికిరాని పాత్రనైన – అమితముగా ప్రేమించితివే
దరికి జేర్చి ధైర్యమిచ్చి – కరుణతో రక్షించితివే
నీ కృపయే నా జీవము కంటే ఉత్తమమని ఎరిగి – స్తుతించెదను
నీవే .. నీవే .. నా ప్రాణదాతవయ్యా

మధురమైన నీ స్వరముచే – నన్ను ఆదరించితివే
నిత్యజీవం అనుభవింప – పేరు పెట్టి పిలిచితివే
తేజోమహిమగల – సంఘముగా మార్చిన – ఘనుడా నా ప్రియ వరుడా
నా శేష జీవితం – నీ సేవకే అంకితం

          Install our App and copy lyrics !

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks . #face protect shield #clear face shield #protect shield #face shield #face protect #facial shield #KN95 FaceMask #Face Mask
Please Add a comment below if you have any suggestions Thank you & God Bless you!

      Leave a reply

      Tamil Christians songs book
      Logo