Yesayya – యేసయ్య నీ ప్రేమ నా సొంతము
Lyrics:
యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం
1. ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి – నీలో నే తరియించీ
2. ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు – సర్వాథికారివి నీవు
మారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు