sangama bayapadakuma – సంఘమా భయపడకుమా
sangama bayapadakuma – సంఘమా భయపడకుమా
సంఘమా భయపడకుమా
నీ కొరకు ప్రభువు రానై ఉన్నాడు
ప్రియ సంఘమా దిగులు పడకుమా
నీ ప్రభువు నీకు తోడై ఉన్నాడు
లోకము నిన్ను ద్వేషించిన
లోకులు నిన్ను దూషించిన
అపవాది నిన్ను శోధించిన
ఎన్నో తంత్రములు అది చేసిన
వాటిని దీవెనగా మార్చగలిగిన
శోధనలు ఎదుర్కొనే కృపనిచ్చిన
గొప్ప ప్రభువు మనకున్నాడు 2
వ్యాధి బాధలు చుట్టుముట్టినా కష్ట నష్టములు కృంగదీసిన
ఆర్థిక సమస్యలు ఎన్ని వచ్చిన
ఆటంకములే నీకు కలిగిన
కార్యము జరగదని కృంగిపోకుమా
విజయము నీదేనని విశ్వసించుమా
గొప్ప ప్రభువు మనకున్నాడు -2
సహాయము చేయువారు లేకపోయినా
ఆదరించువారు అరుదుగా ఉన్న
అభిప్రాయ భేదములు నీలో ఉన్న
అనుకున్నవన్నీ జరగకున్న
ఆదరణను నీకిచ్చు యేసు ఉండగా
ఐక్యత కలిగిస్తానని సెలవిచ్చాగా
గొప్ప ప్రభువు మనకున్నాడు – 2