
OOHINCHALENU PRABHU – ఊహించలేను ప్రభూ నీ మమతను
Lyrics:
ఊహించలేను ప్రభూ నీ మమతను
వివరించలేను యేసు నీ ప్రేమను
నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా
ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా
1. ఈ లోక గాయాలతో నిను చూడగా
లోతైన నీ ప్రేమతో కాపాడగా
కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు
అలుపంటు రాదే సదా నీ కనులకు
ప్రతీ దినం ప్రతీ క్షణం
నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ
2. నాలోని ఆవేదనే నిను చేరగా
నా దేవ నీ వాక్యమే ఓదార్చగా
ఘనమైన నీ నామమే కొనియాడనా
విలువైన నీ ప్రేమనే నే పాడనా
ఇదే వరం నిరంతరం
నీతోనే సాగిపోనా – నా యేసయ్య