Nuvve Lekapothe Nenu Jeevinchalenu – నువ్వే లేకపోతే నేను జీవించలేను
Nuvve Lekapothe Nenu Jeevinchalenu – నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము
నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ
నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము