నా జీవితకాలమంతా – Naa Jeevithakaalamantha
నా జీవితకాలమంతా – Naa Jeevithakaalamantha Telugu Christian song lyrics, written,tune by Pastor Daniel and sung by Sis.Sandhya Daniel
పల్లవి -:
నా జీవిత కాలమంతా నిన్నే స్తుతియించెదా
నేను బ్రతుకు దినములంతా నిన్ను నేను చాటెదా (2)
ఆరాధనా ఆరాధనా (4)(యేసు)
1.నా జీవిత పయనములో
మలుపులెన్నో వచ్చినా
అనుకోని ఆపదలే నన్ను
చుట్టుముట్టినా (2)
ఇమ్మానుయేలువై
నన్ను నీలో దాచితివే (2)
నా పక్షమై నిలచి నన్ను
ఆదరించితివే
(2) (ఆరాధన)
2.అపవాది బాణములే నన్ను
బాధించినా –
ఆశలన్నీ కోల్పోయి నిరాశలో
మునిగినా (2)
ఆశ్చర్యకరుడవై – నన్ను
ఆదుకొంటివే (2)
ఆనంద మయముగా నన్ను
మార్చి వేసితివే (2)
3.అయినవారందరు నన్ను
విడిచి వెళ్లినా
ఆదరించు వారే లేక
ఒంటరినై మిగిలినా (2)
నా కన్న తండ్రివై నన్ను
చేరదీసితివే (2)
కలనైన మరువ లేని –
కార్యాలు చేసితివే (2)
నా జీవితకాలమంతా song lyrics, Naa Jeevithakaalamantha song lyrics, Telugu songs
Naa Jeevithakaalamantha song lyrics in English
Naa Jeevithakaalamantha