Kanikara Sampannuda – పల్లవి: కనికర సంపన్నుడా

Kanikara Sampannuda – పల్లవి: కనికర సంపన్నుడా

Scale: Dm, Signature: 4/4 ; Tempo: 90

పల్లవి: కనికర సంపన్నుడా – నీ పాదముల చెంత నిలచితిమి
నీ చేతితో తాకి స్వస్థపరచు దేవా !
స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు దేవా…[2]

1.శ్రమలో సైతం నీదు సాక్ష్యం విడువని నీ విశ్వాసుల
వేదన విడిపించాయా! – వారి సాక్ష్యము బలపరచయా!
స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు దేవా…[2]

2.ఆదరణలేని నిరాశలవలలో – చిక్కబడిన గృహాలలో
శాంతితో నింపుమయా! – వారి బ్రతుకులు మార్చుమయా!
స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు దేవా…[2]

3.సువార్తకొరకై నిందలు మోస్తూ – శ్రమలలో బ్రతికే సేవకుల
శోధన విడిపించయా ! – ఘనతను దయచేయుమయా!
స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు దేవా…[2]

We will be happy to hear your thoughts

      Leave a reply