Deva maa kutumbamu – దేవా మా కుటుంబము
Deal Score+2
Shop Now: Bible, songs & etc
Deva maa kutumbamu – దేవా మా కుటుంబము
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ
నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
- కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య
లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము - సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము
నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య
ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము - ఏ కీడు రాకుండగా కాపాడుము మాపిల్లలను
లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో
వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్ - పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము
- Enna Kodupaen En Yesuvukku song lyrics – என்னக் கொடுப்பேன் இயேசுவுக்கு
- Varushathai nanmaiyinal mudi sooti Oor Naavu song lyrics – வருஷத்தை நண்மையினால்
- Ya Yesu Ko Apnale Urdu Christian song lyrics
- Ammavin Paasathilum Um Paasam song lyrics – அம்மாவின் பாசத்திலும் உம் பாசம்
- Hallelujah Paaduvaen Aarathipaen song lyrics – தீமை அனைத்தையும்