Christmas Folk Song అన్నన్నా ఓరన్నా ఓరన్నా మాయన్నా

అన్నన్నా ఓరన్నా – ఓరన్నా మాయన్నా
యేసన్న స్వరమును విన్నావా – యెపుడైనా యేసును చూశావా

1. మెల్లమెల్లని స్వరము – చల్లచల్లని చూపు
కరుణించే కరముల తోడ – కన్నీరు తుడిచేవాడు
నీ ఒంటరి బ్రతుకు బాటలో – నీడగ నిలుచుండేవాడు
బాధించు వ్యాధి సమయంలో – తల్లిలా తోడుండేవాడు

2.ధరణిని పాలించేవాడు – దయగల తండ్రే వాడు
దివినేలె రాజే వాడు – ధరలోన మనిషిగ పుట్టి
ధర నరుల పాపభారముకై – బలిపశువే తానైనాడన్నా
ఇలలోన యజ్ఞయాగాలు – ఇక లేనేలేవన్నాడన్నా

3.సాగర జలముల పైన – అల్లాడే ఆత్మే తాను
ఉన్నత శిఖరముపైన – అత్యున్నతుడైన వాడు
లోతైన లోయకుహరంలో – గంభీర స్వరమే తనదన్నా
నీ అంతరంగమందున – అవునంటే కొలువుంటాడన్నా

We will be happy to hear your thoughts

      Leave a reply