Andhala Tara Merisenu Telugu Christmas Song lyrics – అందాల తార మెరిసెను
Andhala Tara Merisenu Telugu Christmas Song lyrics – అందాల తార మెరిసెను
{పల్లవి} అందాల తార మెరిసెను
రారాజు రాక తెలిపెను
ప్రభుని రాక నెరిగి – అవని మురిసెను
విభుని రాక నెరిగి – జగతి సంతసించెను
బెత్లహేము పురములో – జన్మించే దేవనందుడు
మహిమతేజ కాంతుడు మరియసుతుడు
శుభదినం ఈ దినం మానవాళికిది పర్వదినం
శుభదినం ఈ దినం మానవాళి రక్షణదినం
- దైవదూత సందేశం – మహిమ భరిత ఆగమనం
ప్రేమమయునిగా ప్రేమను పంచగ రాగా !!
చలిత లలిత మిళిత – ఘణ స్తోత్రములు
మిన్నులు దాటెను – జయ గీతములై
కొనియాడుమా ఓ మానవ – కొనియాడుమా ఓ మానవ
శుభదినం ఈ దినం మానవాళికిది పర్వదినం
శుభదినం ఈ దినం మానవాళి రక్షణదినం
- దివిని విడిచి దైవమే – భువిలో వెలసె నరునిగా
పాపహరునిగా – సిలువలో మరణించి
మరణ మ్రుళ్ళు విరిచి – గెలిచి లేచెను
రక్షణ భాగ్యం కలిగె మనకు
ప్రణతిల్లుమా ఓ సంఘమా – ప్రణతిల్లుమా ఓ సంఘమా
శుభదినం ఈ దినం మానవాళికిది పర్వదినం
శుభదినం ఈ దినం మానవాళి రక్షణదినం // అందాల తార //