Gathakalamu New year song lyrics – గతకాలము నీ కృపలో నను రక్షించి

Deal Score0
Deal Score0

Gathakalamu New year song lyrics – గతకాలము నీ కృపలో నను రక్షించి

గతకాలము నీ కృపలో నను రక్షించి
దినదినమున నీ దయలో నను బ్రతికించి
నీ కనికరమే నాపై చూపించి
నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!
నా స్థితిగతులే ముందే నీవెరిగి
ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! “2”

నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా ప్రభువా..నీకే స్తోత్రము..

కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక
దినమంతా వేదనలో నేనుండగా..
నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక
గతమంతా శోధనలో పడియుండగా..
ఏ భయము నను అవరించక..
ఏ దిగులు నను క్రుంగదీయక
నాతోడునీడవై నిలిచావు
నా చేయి పట్టి నడిపించావు

కాలాలు మారగా..బంధాలు వీడగా
లోకాన ఒంటరినై నేనుండగా
నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో
జీవితమే భారముతో బ్రతికుండగా
అరచేతిలో నన్ను దాచిన
కనుపాపల నన్ను కాచిన
నీ చెలిమితోనే నను పిలిచావు
నా చెంత చేరి ప్రేమించావు..

ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
నా మనసు పరవశమై స్తుతి పాడగా
ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
నా స్వరము నీ వరమై కొనియాడగా
నీవిచ్చినదే ఈ జీవితం
నీ కోసమే ఇది అంకితం
నీ ఆత్మతోనే నను నింపుమయా..
నీ సేవలోనే బ్రతికించుమయా

    Jeba
        Tamil Christians songs book
        Logo