Nee kreesthudananu – నే క్రీస్తుదానను
Nee kreesthudananu – నే క్రీస్తుదానను
నే క్రీస్తుదానను – నే వాడబారను
నే క్రీస్తుదానను – కదల్చబడను
కొండలే ఎదురుగ నిలచినను – బండలు నాపై దోర్లినను
ఖడ్గమే గుండెలో దూసినను – కడలిలో నేను మునిగినను
నాయేసు నాకు తోడుండగా -ఏ స్థితి ఐన స్తుతి పాటేగా
నాకు స్తుతి పాటేగా ||నే క్రీస్తుదానను ||
- నావారేనను తరిమినను – అవమానమేనను నులిమినను
ఏకాకినై నేను తిరిగినను – లోకాన నే ఎగతాలైనను
నా యేసే నాకు అతిశయము – ఏ స్థితి ఐన అతిశ్రేష్టము
నాకు అతిశ్రేష్టము ||నే క్రీస్తుదానను || - ఏది జయము ఏది అపజయము- అబ్రాహాము రొమ్మున లాజరే జయము
ఏది నష్టము ఏది లాభము – మన యోబు జీవితమే సాక్ష్యము
నాయేసు చిత్తములో బ్రతుకుట – మరణములోకూడా జయమొందుట
విజయమొందుట ||నే క్రీస్తుదానను ||