Na sahayam Nevenayya – నా సహాయం నీవేనయ్యా
Na sahayam Nevenayya – నా సహాయం నీవేనయ్యా
పల్లవి :
కొండలతట్టు నా కన్నులెత్తి నేను చూచెదనా “2”
కన్నులు నీవైపే ఎత్తెదను మనస్సు నీవైపే త్రిప్పేదను “2”
యేసయ్యా యేసయ్యా నా సహాయం నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా నా బలము నీవేనయ్యా. ” కొండలతట్టు”
1చరణం :
శ్రమలన్నీ ఒకసారే కలిసి మీదికి వచ్చినా “2”
ఆత్మీయులే పగవారై దూషణలేన్నో పలికినా
నా వల్లకాక రోదించగా కనికరించావయ్య “2”
నా కొమ్ము పైకెత్తి వారెదుటనే హెచ్చించి స్థిరపరిచినావే
యేసయ్యా యేసయ్యా నా సహాయం నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా నా బలము నీవేనయ్యా. ” కొండలతట్టు”
2చరణం :
రాజులైన అధికారులైనా సాటిరారు నీయెదుట
నాకంటూ లేరెవ్వరు ఉన్నది నీవేగా నా యేసయ్యా “2”
నను వీడిపోని నా బంధమా నీవేగదా క్షేమమూ
చిరకాలము నను దాచేవాడ నీవేగా నా కేడెము “2”
యేసయ్యా యేసయ్యా నా సహాయం నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా నా బలము నీవేనయ్యా. ” కొండలతట్టు”