Balipeetame Telugu – బలిపీఠమే బలిపీఠమే
Deal Score+2
Shop Now: Bible, songs & etc
Balipeetame Telugu – బలిపీఠమే బలిపీఠమే
బలిపీఠమే బలిపీఠమే
కళంకము కడిగిన
కన్నీరు తుడిచిన
కల్వరి బలి పీఠమే
- పాప నివృత్తి చేయ పరిహార బలి అయిన
పరలోక బలిపీఠమే
రక్తము చిందించి రక్షణ నొసగిన
రక్షకుని బలిపీఠమే - మన్నించు మన్నించుమని
మనసారా పలికినట్టి
మహిమా బలిపీఠమే
ఎప్పుడు చేరిననూ
కనికరించి సహాయం చేసే
కరుణ బలిపీఠమే - ప్రక్కను ఈటెతో నా కొరకై
పొడవబడిన ప్రియుని బలిపీఠమే
రక్తము, నీరును ప్రవహించె జీవనదియై
కృతజ్ఞత ఎలా చూపెదన్ - సమాప్తమైనదనుచూ
అన్నియూ చేసి ముగించిన
అద్భుత బలిపీఠమే
అప్పగించుచున్నాను ఆత్మను అని
అర్పించిన సాటిలేని బలిపీఠమే