YOODHAA SAAKSHYAMU – యూదా సాక్ష్యము
Lyrics:
యూదా సాక్ష్యము గల వారెందరో ?!
యేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?!
అలనాడు యేసు తోడ – నివసించిన ఆ యూదా
యేనాడు కాని వాడు – ఐనాడు మోసగాడు
యేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?! ।యూదా।
అలనాడు మూడు పదుల – నాణెములకు యేసునమ్మి
యేనాడు కాని వాడు – ఐనాడు కాసులోభి
యేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?! ।యూదా।
అలనాడు యేసు మరణం – కలిగించె లోన బాధ
యేనాడు కాని వాడు – ఐనాడు ఉరికి గురిగా
యేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?! ।యూదా।