Yesu Nee Rakthamu song lyrics – యేసు నీ రక్తముతో నన్ను కడుగుము

Deal Score+1
Deal Score+1

Yesu Nee Rakthamu song lyrics – యేసు నీ రక్తముతో నన్ను కడుగుము

యేసు నీ రక్తముతో నన్ను కడుగుము
నన్ను శుద్దీకరించుము
నా యేసయ్యా //2//
నీ రక్తముతో నా దేహమును
నూతన పరచుము నజరేయుడా//2//
నూతన పరచుము నజరేయుడా
( (యేసు నీ రక్తముతో))

ఇన్నాళ్లు తెలియక అంధుడ నైతిని
కొలిచితి ఎన్నో వ్యర్థమైన వాటిని//2//
కార్చిన నీ రక్తం తెరచెను నా కనులు
చూచెద నేనిప్పుడు
సుందర నీ ముఖము//2//
నా యేసయ్యా

నీకే ఆరాధన నీకే ఆరాధనా //4//
((( యేసు నీ రక్తముతో)))

నీ చిత్తమును నే మరచితిని
నీ కార్యములు నే విడచితినీ //2//
నీ రక్తములో నా హృదయమును
నూతన పరచుము నా యేసయ్యా //2//
నీకే ఆరాధన నీకే ఆరాధన //4//
(((యేసు నీ రక్తముతో))))

కలువరి గిరిలో కార్చిన నీ రక్తం
పాప విమోచన కలిగించు నీ రక్తం //2//
నీవుండు స్థలములో నేనుండుటకు
నా పాపమును తొలగించితివి //2//
నా యేసయ్యా

నీకే ఆరాధన నీకే ఆరాధన //4//
(((( యేసు నీ రక్తముతో)))))

Jeba
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians songs book
      Logo