పల్లవి : తీయని స్వరాలతో నా మనసే నిండెను
యేసుని వరాలతో నా బ్రతుకే మారెను
భావమధురిమ ఉప్పొంగెను
రాగసుధలతో భాసిల్లెను
పరవసించి నిను స్తుతించి
ఘనపరెచెదా వైభవముగా
చరణం : ఏదేమైనా ఏనాడైన నీ దారిలో నేను
నీవే నాకు ఆప్తుడైన నిన్నాశ్రయించాను
సజీవుడా నీవే లేని నేనే వ్యర్ధము
ఏదేమైన ఏనాడైనా నీ దారిలోనేను
యేసుతో రాజ్యము చేసే భాగ్యము
నాకు దొరికె కనికరము తనువు పరవశము
చరణం : ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను
నిన్నేనమ్మి జీవించేను నీలో ఫలించేను
సహాయుడా నీలోనేగా నా సాఫల్యము
ఆరాధనా యోగ్యుడైన నీ సొంతమే నేను
యేసుని సన్నిధి చేరే భాగ్యము
నాకు కలిగె అనుగ్రహము తనువు పరవశము