ప్రేమస్వరూపుడు యేసుక్రీస్తుని – Telugu Christmas Entrance Song
ప్రేమస్వరూపుడు యేసుక్రీస్తుని – Telugu Christmas Entrance Song
ప్రేమస్వరూపుడు యేసుక్రీస్తుని
జననమును కొనియాడగ రండి..
పవిత్ర దేవుని ఈబలిపూజలో భక్తితో పూజింపగ రండి..
భక్తితో పూజింపగ రారండి..
పల్లవి
మరియసుతుడు యేసునాధుని సన్నుతించెదం
నిర్మలహృదయుడు మహోన్నతుని పూజించెదం ll 2 ll
కోరస్
ప్రేమస్వరూపుడు మనకై జన్మించెను ll 2 ll
స్తుతిగానాలతో స్తుతిస్తోత్రాలతో ll 2 ll
ఈదివ్యపూజలో కీర్తించెదం
ll పల్లవి ll
చరణం 1
త్రిత్వైక దేవుని ప్రేమ వరమాయెను
ప్రభుసాన్నిధ్యం మనకు తోడాయెను ll 2 ll
మన హృదిలో క్రీస్తు కొలువాయెను
మనలను రక్షించే దేవుడై నిలిచెను ll 2 ll
మనలను రక్షించే దేవుడై నిలిచెను ll కోరస్ll
చరణం 2
నీతిసూర్యుడు మనకై ఉదయించెను
రక్షణకాంతులు భువిలో ప్రభవించెను ll 2 ll
కరుణామయుడు మనకై ఏతెంచెను
నిత్యయాజకుడై మనతో వసియించెను ll 2 ll
నిత్యయాజకుడై మనతో వసియించెను
ll కోరస్ ll
క్రిస్మస్ ప్రవేశ గీతము