శ్రీయేసు పుట్టిండు పండుగ సేతము ఓరన్నా
రారాజు జన్మించిండు ఆడి పాడుద మో యక్కా
బంగారు వన్నే లోడు బలవంతుడొరన్న
సిరునవ్వుల సిన్నోడు శక్తిమంతుడే ఓయక్క
ఉత్సాహం ఉల్లాసం ఆనందమే
ఏసయ్యా బుట్టినాడు సంతోసమే
1. మనుజూడై పుట్టినాడు మనలా కాపాడురన్నా
నరరూపు దాల్సీనాడు నరకుల రచ్చించూనక్క
జింకోలె గంతులు ఏసి యేసయ్యను కొలువండన్న
నెమలోలే నాట్యామాడి యేసన్నను వేడండాక్క
జై జై జై జయము మన యేసు రాజుకు
2. పాపాలను పార దోలు దొరయే మనయేసుడన్నా
సాతానును సం హారించు సఖుడే మన క్రీస్తోయక్క
బాజా బజంత్రీలతో భజనాలు సేయండన్నా
దరువుమీద దరువేస్తు ధన్యుడేసును మొక్కండక్కా
జై జై జై జయము మన యేసు రాజుకు