
SAMARPINCHEDHANU – సమర్పించెదను సమస్తము
సమర్పించెదను సమస్తము
సన్నుతించెదను సతతము
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును,
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
1. శ్రేష్టమైనవి కలిగించెను నష్టము
లోకజ్ఞానము ఆయెను వెర్రితనము
ధనము దరిచేర్చెను నాశనము
పరపతి చూపించెను దుష్టత్వము
2. నిలుపుకొనెదను నీ మాదిరి వినయము
చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు
అర్పించెదను నా ప్రాణము
ఇదియే ఆరాధనా బలిపీఠము