పూజింతునయ్యా పూజర్హుడా ఆరాధింతును ఆరాధ్యుడా ౹౹2౹౹
స్తుతియింతునయ్యా స్తుతికి పాత్రుడా నీకే స్తోత్రము చెల్లింతును ౹౹2౹౹
1.నా ప్రాణమే నాలో కృంగిన వేళ
నీరక్షణను ఇచ్చి రక్షించితివి ౹౹2౹౹
సత్యవంతుడా నిన్నే స్మరియింతు ౹౹2౹౹
సతతము నిన్నే నా యేసయ్యా
౹౹పూజింతు౹౹
2.భక్తిహీన బంధములో చిక్కియున్నవేళ
నీ శక్తినిచ్చి నను నిలిపితివి ౹౹2౹౹
శక్తివంతుడా నిన్నే కొనియాడేదను ౹౹2౹౹
అనుదినం నిన్నే నా యేసయ్యా
౹౹పూజింతు౹౹
3.లోకులందరూ నన్ను వెలివేసిన వేళ
ఆదరణ చూపి నను ఆదుకొంటివే ౹౹2౹౹
ఆత్మీయుడా నిన్నే ఆరాధింతును ౹౹2౹౹
నాజీవితాంతము నా యేసయ్యా
౹౹పూజింతు౹౹