PARISHUDDHAME – పరిశుద్ధమే యేసుని రక్తం song lyrics

Deal Score+6
Deal Score+6


పరిశుద్ధమే యేసుని రక్తం – ప్రవహించెను కల్వరిలో
కడుగబడును పావన రక్తం – ప్రభుయేసునే ఆరాధించు

సూరూపమైనను సొగసైననులేదు – తృణీకరింపబడెను
విసర్జించిరి మనుజులెల్లరును – దైవమె చేయి వీడెను
పదివేలలోన అతిసుందరుండు రూపునే కోల్పోయెను

వ్యసనాక్రాంతుడుగా వ్యాధిగ్రస్థునిగా కనిపించే నా ప్రియుడు
మనము చూడనొల్లని స్వరూపుడాయె మనమెన్నిక చేయలేదు
పదివేలలోన అతి శ్రేష్ఠనీయుడు హీనునిగా చేయబడెను

మన రోగములను భరియించె ప్రభువే నిశ్చయముగా ఆ సిల్వపై
మన వ్యసనములన్ని వహియించినతడే దేవుని వధ గొర్రెపిల్లయి
పదివేలలోన అతిపరిశుద్ధున్డు పాపముగా చేయబడెను

మన దోషములకై గాయములనొంది స్వస్థతనిచ్చే ప్రియుడై
మన సమాధానకర్త శిక్ష భరియించె నలుగగొట్టబడెను
పదివేలలోన అతిమహాఘనుడు రక్తపుముద్దాయెను

బాధింపబడిన మౌనియైయుండెను నోరుతెరువడాయెను
అన్యాయపుతీర్పు నొందినవాడై బలియాయేనాసిల్వలో
పదివేలలోన అతికాంక్షణీయుడు ద్వేషింపబడిపోయెను

Tags:

christians
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians songs book
      Logo