నీవే కృపాదరము త్రియేక దేవా
నీవే క్షేమాధారము నా యేసయ్య ‘2’
నూతన బలమును నవనూతన కృపను ‘2’
నేటివరకు దాయచేయుచున్నావు
నిన్నే ఆరాదింతును పరిశుద్ధుడ
ఈ స్తోత్రగీతం నీకెనయ్య. “నీవే”
1.చరణం:
ఆనందించితిని అనురాగబంధాల
ఆశ్రయపురమైనా నీలో నేను ‘2’
ఆకర్షించితివి ఆకాశముకంటే
ఉన్నతమైననీ ప్రేమను చూపి ‘2’
ఆపదలెన్నో అలుముకున్నాను అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
ఈ స్తోత్రగీతం నీకేనయ్య “నీవే”
2.చరణం:
సర్వకృపానిది సీయోను పురవాసి
నీ స్వాస్థ్యముకై ననుపిలచితివి ‘2’
సిలువను మోయుచు నీ చిత్తమును
నెరవేర్చెదను సహనముకలిగి ‘2’
శిథిలముకాని సంపాదలెన్నో నాకై దాచితివి
సాహసమైన గొప్పకార్యములు నాకై చేసితివి
సర్వశక్తిగల దేవుడవై నడిపించుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్దుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్య ‘నీవే’
3.చరణం:
ప్రాకారములను దాటించితివి
ప్రార్థనవినెడి పావన మూర్తివి ‘2’
పరిశుద్ధులతో ననునిలిపితివి
నీకార్యములను నూతనపరచి ‘2’
పావనమైన జీవనయాత్రలో విజయమునిచ్చితివి
పరమరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
పావనుడా నాఅడుగులుజారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్దుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్య
Neeve krupadhaaramu triyeka deeva- neeve kshemaadhaaramu naa yesayya-2
Nuthana balamunu navanuthana krupanu-2
Neetivaraku dayacheyuchunnavu
Ninne aaradhinthunu parishudduda
Ee stothrageetham neekenayya
1. Aanandinchithini anuraagabandhana- aasrayapuramayina neelo neenu-2
Aakarshinchithivi aakasamukante vunnathamaina nee Premanu chupi-2
Aapadalenno alumukunnanu abhayamunichithivi
Aaveedanala agnijwalalalo andaga nilichithivi
Aalochanavai aasrayamichi kaapaduchunnavu
Neeke ee premageetham ankithamayya- ee stothrageetham neekenayya “neeve”
2.prardinchithini praakaramulanu- daatinchagaligina prabhuve neevani-2
Parishudhathakai niyaminchithivi – nee rupamu naalo kanaparachutaku-2
Paavanamayina jeevanayathralo vijayamu nichithivi
Paramarajyamulo cherchutakoraku abhishekinchithivi
Paavanudaa naa adugulujaaraka sthiraparachinaavu
Ninne aaradhinthunu parishudduda- ee stothrageetham neekenayya “neeve”
3.sampurnathakai santhrupthikaligi-siluvanu moyuchu neetho nadicheda-2
Sudivadina naa brathukunu maarchithivi-simhasanamukai Nanu pilachitivi-2
Sidhilamu kaani sampadalenno naakai daachithivi
Saahasamaina goppa kaaryamulu naakai chesithivi
Sarvashakthigala deevudavai naa mundu nadachina
Ninne aaradhinthunu parishudduda-ee stothrageetham neekenayya “neeve”