నీవే ఆశ నీవే శ్వాస – neeve asha neeve swasa
నీవే ఆశ నీవే శ్వాస – neeve asha neeve swasa
నీవే ఆశ నీవే శ్వాస ౼ నీవే ద్యాస యేసువ
నీవే ప్రాణం నీవే గానం ౼ నీవే ధ్యానం నేస్తమా
తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2)
నీ రూపులోనె నీ చేతి పనిగా ౼ నను నీవు మలచితివే
నీ శ్వాశతోనే నీ మహిమ కొరకై ౼ నను సృజియించితివే ॥నీవే ఆశ ॥
ఇహమున నా కొసగిన ౼ ఈ ధర ఎంత భాగ్యమని
తలచితి నే భ్రమచితి ౼ అంతయు నాకు సొంతమని
ఆశతో నేను పరుగిడితి ఇలలో చెలిమికై
ప్రతి హృదయం స్వార్దమయే
ప్రేమను ప్రేమగా చూపె మనసొకటి కలిగిన
ఒక ప్రేమైన కాన రాదే ॥ నీవే ఆశ ॥
హృదయము పులకించెను ౼ నీ ప్రేమ ప్రచించగనే
ధృఢమాయె నా మదిలో ౼ ఇక అంతయు స్వార్దమని
నా జీవన గమనాన్ని నీ వైపు మలచి
నీ అడుగులలో నే నడచే
నీ ప్రియమైన ప్రేమగ ఇలలో జీవించి
నీ కౌగిలిలో ఒదుగుదునే ॥ నీవే ఆశ ॥
- Enna Kodupaen En Yesuvukku song lyrics – என்னக் கொடுப்பேன் இயேசுவுக்கு
- Varushathai nanmaiyinal mudi sooti Oor Naavu song lyrics – வருஷத்தை நண்மையினால்
- Ya Yesu Ko Apnale Urdu Christian song lyrics
- Ammavin Paasathilum Um Paasam song lyrics – அம்மாவின் பாசத்திலும் உம் பாசம்
- Hallelujah Paaduvaen Aarathipaen song lyrics – தீமை அனைத்தையும்