Nee krupa bahulyame song lyrics – నీ కృపా బాహుళ్యమే
Nee krupa bahulyame song lyrics – నీ కృపా బాహుళ్యమే
ఈ నూతన సంవత్సరం నీ కృపా బహుల్యమే
నీ దివ్య సన్నిధియే నీవిచ్చిన భాగ్యమే(2)
ప్రభువా నీ కృపా నను కాచినే
దేవా నీ వాక్కు నడిపించెనే(2)
సజీవులమై నిత్యము నీకే స్తుతి చెల్లించెదము(2)
ఆహా హల్లేలూయా… ఆహా హల్లేలూయా…
1, నీ మేలులు నా యెడల ఎన్నో చేసితివే నీ దీవెన నా పైన ఎంతో చూపితివే
నీ మేలులు నా యెడల ఎన్నో చేసితివే నీ దీవెన నా పైన ఎంతో చూపితివే
వర్ణించలేనయా వివరించలేనయా నీ గొప్ప ప్రేమను నే మరువలేనయ్యా(2)
ఆహా హల్లేలూయా… ఆహా హల్లేలూయా…(2)
ఈ నూతన సంవత్సరం నీ కృపా బహుల్యమే
నీ పాద సన్నిధియే నీవిచ్చిన భాగ్యమే(1)
- నే కృంగిన వేళలలో నన్ను లేవనెత్తితివే
నే అలసిన సమయములో నన్నాదరించితివే
నే కృంగిన వేళలలో నన్ను లేవనెత్తితివే
నే అలసిన సమయములో నన్నాదరించితివే
నూతన బలమును నాకిచ్చినావే నీ ఆత్మ చేత నడిపించినావే
ఆహా హల్లేలూయా… ఆహా హల్లేలూయా…(2)
ఈ నూతన సంవత్సరం నీ కృపా బహుల్యమే
Nee krupa bahulyame Thanks Giving song lyrics