Nee Brathiki unnanu song lyrics – నే బ్రతికి ఉన్నను, మరణించినను
Nee Brathiki unnanu song lyrics – నే బ్రతికి ఉన్నను, మరణించినను
పల్లవి..
నే బ్రతికి ఉన్నను, మరణించినను
నే నిలచి ఉన్నను పడిపోయినను..2..
అనుదినము అనుక్షణము నా తోడుగా
ప్రతి ఘడియా ప్రతి నిమిషం నా నిడగా..2…
అను పల్లవి :
నాకు నీవు ఉన్నావు యేసయ్య
నాలో నీవు ఉన్నావు నా యేసయ్య ..2..
1..అంత కోల్పోయి అణగారిన గాని – లేవలేని స్థితిలో నేనున్నగాని
నడవలేక అడుగులు తడబడిన గాని – హృదయమంత గాయాలతో నిండిన గాని ..2 – నాకు నీవున్నావు…
2.. కెరటాలు ఎగసి పడినాగాని _ సముద్రము ఉప్పొంగి లేచిన గాని
కారు చీకటులె కమ్మిన గాని _ సాతాను నన్ను శోధించిన గాని ..2 – నాకు నీవున్నావు..
- లోకమంత నన్ను విడచి మరచిన గాని – లోకువగా చూసి గేలి చేసిన గాని
చేసిన మేలుకు కీడు వచ్చిన గాని _కన్నీళ్లను కానుకగా ఇచ్చిన గాని ..2 – నాకు నీవున్నావు