Nannerigina Devudavu – పరిశోధించి నన్ను ఎరిగిన దేవుడవు
Nannerigina Devudavu – పరిశోధించి నన్ను ఎరిగిన దేవుడవు
పరిశోధించి నన్ను ఎరిగిన దేవుడవు నా తలంపులన్నియు గ్రహింతువు
నే నడిచిన పరుండిన తోడుంటివీ
నా మార్గములన్ ఎరిగియుంటివీ ।2॥
1.నీ ఆత్మకు మరుగై ఎటుపోదునో
నీ సన్నిధిని వీడి ఎటు పారిపోదునో ।2॥ —నే నడచినా…
2. నా తల్లి గర్భములో నిర్మించితివి
ఆశ్చర్య రీతి లో నను చేసితివీ ।2॥
— నే నడచినా
3.నా ఆలోచనంతయూ తెలుసు కొందువు
నిత్య మార్గమునా నడుపుదువూ ।2॥
— నే నడిచినా