Entha Vinthayo Nee Thyagamu lyrics – ఎంత వింతయో నీ త్యాగము
Entha Vinthayo Nee Thyagamu lyrics – ఎంత వింతయో నీ త్యాగము
పల్లవి:
ఎంత చల్లని దేవుడవయ్య
ఎంత చక్కని రూపమయ్య
ఎంత అని వర్ణింపను ఇలలో
ఎంత వింతయో నీ త్యాగము
చరణం 1
రాజువని హేళన చేసి
నిందలతో నిను బాధించగ
చేయుచున్నది మేమెరుగమని
క్షమియింపగ తండ్రిని వేడిన
చరణం 2
నా పాప జీవితమే
శిలువ నీకు భారము చేయగ
రక్షణ మాకనుగ్రహించి
పరదైసుకు మార్గము చూపిన
చరణం 3
మేకులు దిగ కొట్టితిమయ్య
చేదు చిరకనిచ్చితిమయ్య
దప్పిగొనియు నీవు మాకు
జీవ జలము పంచితివయ్య