Deva Gnanamunimmu Telugu christian song lyrics – దేవా జ్ఞానమునిమ్ము
Deal Score0
Shop Now: Bible, songs & etc
Deva Gnanamunimmu Telugu christian song lyrics – దేవా జ్ఞానమునిమ్ము
దేవా జ్ఞానమునిమ్ము
తెలివి వివేకము నిమ్ము
ఆలోచనా బలమునిమ్ము
నీ యెడల భయభక్తులనిమ్ము
- అంధకారము ఆవరించగా
నీ వెలుగులో నడిపించుము దేవా
అపవాది అణచివేయగా
నీ బలముతో నిలబెట్టుము దేవా
కొరతలలో సమృద్ధి నీవై
రోగములో స్వస్థత నీవై
బాధలలో ఓదార్పువై
నిత్యము నను నడిపించు యెహోవా - యవ్వన కాలమున కాడి మోయను
ఆలోచన చెప్పుము ఓ తండ్రి
మార్గము తప్పి నడచు వేళ
భయభక్తులు నేర్పుము ఓ తండ్రి
మార్గములో కాపరివై
బలహీనతలో సామర్థ్యమువై
యుద్ధములోన ఖడ్గము నీవై
కడవరకు నా తోడై ఉండుమా