పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు రక్షణ తెచ్చిన జయశీలుడు -2
మరణచ్ఛయాలు సమసిపోగా పాపభారం తొలగిపొగ -2
చీకటిలో ఉన్న జనులందరు ఆగొప్పవెలుగును చూచిరి 2
క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట సంతోషం
క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం
1. చీకటివాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగివచ్చెను పాపపుబ్రతుకులలో జీవకిరణమై ఉదయించెను -2
మా గుండెల్లో పండుగాయెను ఊరంతా సందడాయెను -2 క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట సంతోషం
క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం
2. రోధనధ్వనిలో రక్షణద్వారమై నీరీక్షణ కలిగించెను సమస్యల సంకెళ్లుతెంచి తలరాతలు మార్చివేసెను – 2 రక్షణనిచ్చే రారాజు సామాన్యుడు కాడు ఆయేసు -2 క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం