Ascharyakarudu Aloochanakartha – ఆశ్చర్యకరుడు ఆలోచనాకర్త

Deal Score0
Deal Score0

Ascharyakarudu Aloochanakartha – ఆశ్చర్యకరుడు ఆలోచనాకర్త

పల్లవి: ఆశ్చర్యకరుడు- ఆలోచనాకర్త బలవంతుడైన – దేవుడు
నిత్యుడగు – తండ్రి సమాధానకర్త – యేసే అందరి దేవుడు /2/
కన్యకు పుట్టినాడు – పరిశుద్ధ దేవుడు
పాపాలు కడిగివేసే – ఈ లోక రక్షకుడు /2/
కొనియాడి పాడి వేడేదం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ /2/

1: వాక్యమైయున్న ఆ దేవుడు
సర్వ సృష్టికి కారణ భూతుడు
శరీరధారిగ యేసు నామములో యిలలో జన్మించెనూ / 2/
సృష్టికర్త యైన యేసు మనము నమ్మిన
సృష్టి అంతటి పై జయము మనదే అగును /2/ హ్యాపీ

2: నశించిపోతున్న ఈ లోక ప్రజలను
ప్రేమతో రక్షించాలని
సిలువలో మరణించి తిరిగి లేచుట కు ఇలలో జన్మించెను /2/
ప్రభువైన యేసయ్యను మనమూ నమ్మిన మనము మన ఇంటి వారు రక్షణ పొందేదం /2/ హ్యాపీ

3: తల్లి తన బిడ్డనూ మరచిన నేను నిను మరువను అనినా
దేవదేవుడె ఇమ్మానుయేలుగ యిలలో జన్మించెను /2/
దిగులు వద్దు భయము వద్దు అని చెప్పిన మన యేసు ని మదిలో తలచి ఆరాధించెదం /2/ హ్యాపీ

Ascharyakarudu Aloochanakartha Telugu Christmas Song lyrics ఆశ్చర్యకరుడు

    Jeba
        Tamil Christians songs book
        Logo