Arhatha Ledayya Yesaiah – అర్హత లేదయ్య యేసయ్యా
Arhatha Ledayya Yesaiah – అర్హత లేదయ్య యేసయ్యా
పల్లవి :
అర్హత లేదయ్య యేసయ్యా..
నను ప్రేమించుటకు మెస్సయ్య.
కేవలం నీ కృపయే యేసయ్యా..
నను రక్షించినది మెస్సయ్య.
ఏముంది నాలో నను ప్రేమించుటకు. ఏముంది నాలో నను రక్షించుటకు.
నీ కొరకే బ్రతికెదను యేసయ్య.. నీలోనే జీవించెద మెస్సయ్య.
1) గర్వాంధుడనై నే దారి తప్పిపోతిని. గమ్యము తెలియని బాటసారి నైతిని.
వేసారి పోయిన నా జీవితమును
వెలిగించితివి నా యేసయ్య.
చేయి పట్టి నడిపించుము నను యేసయ్య..
కడవరకు నీతోనే మెస్సయ్య..
నీ ప్రేమలోనే నను దాచుమయా యేసయ్య..
క్షేమమున్నది నీ కృపలోనయ్యా…
2).అడుగడుగున అవరోధాలే పలకరించిన..
శత్రువులే నను కృంగదీసిన.
నను ఎడబాయదు నీ కృప యేసయ్య.
క్షణమైనా మరువదు నన్ను నీ ప్రేమ మెస్సయ్య.
చంటి పాపలా నడిపించుము నను యేసయ్య.
కంటిపాపలా కాపాడుము నను మెస్సయ్య.
నా జీవితమంతా నీ కోసమే నా యేసయ్య.
పరిశుద్ధతలో నడిపించుము నను మెస్సయ్య.
3) అయినవారె దూషించి గేలి చేసిన.
బాధలన్ని రాబంధులై వేధించినా.
నను వెంటాడను నీ ప్రేమ యేసయ్య
నను రక్షించెను నీ కృప మెస్సయ్య.
నిన్ను విడిచిన నన్ను విడువని యేసయ్య.
ఎందుకింత ప్రేమ నాపై మెస్సయ్య.
ఏ స్థితిలో ఉన్న నన్ను మరువని యేసయ్య.
ఉన్నత స్థితిలో నను నిలిపితివి మెస్సయ్య.