ఒంటరి పయనాన – నీవు నాతోనుండా
భయమేల నాకీ లోకానా
నాలో వున్నవాడు లోకంలోని వానికంటె
శక్తివంతుడు – బహు బలవంతుడు
1. లోకమంతా నాదన్న – తోడు ఎవరు లేరు
అందరూ నావారన్నా – ఆదరించువారులేరు
ప్రతికష్టమునందు యేసు – కాపరియై నాతో నడుచున్
2. తోడు రారు మనుష్యులు – కొంత దూరమైనా
యేసు నాతో నడుచును – ఎంత దూరమైనా
ప్రతిఅడుగు నాతో నడుచున్ – పరము చేరువరకు