బలముచేత కాక – Balamu Chetha Kaaka
బలముచేత కాక – Balamu Chetha Kaaka Naa Shakthi Chetha Kaaka Telugu christian song lyrics,tune & chorus by Chandra Sekhar Veeranala.Agape Naidupet.
బలముచేత కాక – నా శక్తిచేత కాక
నీ ఆత్మశక్తిచేత కార్యము చేయు యేసు దేవా సైన్యములకు అధిపతివి సాటి ఎవ్వడు? నిన్నడ్డగించుటకు పోటీ ఎవ్వడు?
వేల్పులలో నీవంటి వాడు ఎవ్వడు? – చాచిన నీ బాహువును త్రిప్పువాడెవ్వడు?
1)పురుగువంటి నరుడను నేను – కరుగుచున్న దివ్వెను నేను
చితికియున్న పిండము నేను బ్రతుకుచున్న శవమును నేను
పదునైన మానుగా నను మార్చియున్నావు – నీ కరుణనే నాపైన చూపియున్నావు
కక్కులు పెట్టిన నురిపిడి మానుగా నన్ను నియమించిన చిక్కులలోనూ నను గెలిపించిన నిన్ను స్తుతియించెద
2)కుష్ఠమున్న మనిషిని నేను – సౌష్టవము కోల్పోయాను
కష్టమునకు అలుసైనాను – కాష్ఠమునకు నెలవైనాను
పసిపిల్లలా దేహం మార్చియున్నావు – లోబడుటకు నాకు నేర్పియున్నావు సంకటములలో నను సవరించిన నిన్ను స్తోత్రించెద
మించిన గిరులను నను ఎక్కించిన నిన్ను ప్రార్థించెద
బలముచేత కాక song lyrics, Balamu Chetha Kaaka song lyrics. Telugu songs.