ఒక క్షణమైనా – Oka kshanamaina

Deal Score0
Deal Score0

ఒక క్షణమైనా – Oka kshanamaina Jesus Christ Church Christian songs Lyrics in Telugu and English

పల్లవి :
ఒక క్షణమైనా విడిచి నేనుండలేనయ్యా
ఈ జీవితం నువ్వు చేసిన త్యాగమేనయ్యా
నీ మేలులు తలంచి చూస్తేనయ్యా
కన్నీరే సెలయేరై పొంగేనయ్యా

నా దేవా నా దేవా కుంగిన మనస్సే చూశావయ్యా
నా దేవా నా దేవా నీ కృప నాపై చూపావయ్యా
నా దేవా నా దేవా నా జీవితమే మారిందయ్యా
నా దేవా నా దేవా నీ కృపలో నేనుంటానయ్యా
“ఒక క్షణమైనా”

చరణం 1 :
గర్భమందు నేపడిన తరుణంలో
ఒంటరిగా నేనున్న సమయంలో
ఏమియు కానరాని చీకటిలో
పిండముగా నేనున్న వేళలో

అపాయమేమి రాకుండా కాపాడినావే
కంటికి రెప్పల కన్న తండ్రివై నన్ను కాచినావే
కేడెముగా నీ దయనే నాపై కప్పితివే
ప్రేమతో నాకే నీ రూపాన్నిచ్చావే

ఎందుకు నాపై ఇంత ప్రేమయ్యా
ఎమిచ్చినా నీకై తక్కువేనయ్యా

నా దేవా నా దేవా నా జీవితమే మారిందయ్యా
నా దేవా నా దేవా నీ కృపలో నేనుంటానయ్యా

చరణం 2:

అయినవారె అందరూ వెలివేయగా
వాడుకొని అందరూ విసిరేయగా
పనికిరాని గతమే బాధించగా
హృదయమంత వేదనతో నిండగా

విరిగిన నలిగిన మనసుతో
నిను చేరితినేనయ్యా
కన్నీరు తుడిచి కాపాడినావయ్యా
బాధలు వేదనలన్నీ తొలగించినావయ్యా

నేనున్నా నీకని దరి చేరినావయ్య
నువు తప్ప నాకిలలో ఎవ్వరు వద్దయ్యా
లోకాన్ని విడిచి జీవింతు నేనయ్యా
తండ్రీ నీవు తప్ప నాకిలలో ఎవ్వరు వద్దయ్య
లోకాన్ని విడిచి జీవింతు నేనయ్యా

నా దేవా నా దేవా నా జీవితమే మారిందయ్యా
నా దేవా నా దేవా నీ కృపలో నేనుంటానయ్యా

చరణం 3:

పాపానికే బానిసనై నేనుండగా
పనికిరాని పాత్రగా నే మారగా
బ్రతుకంతా చీకటితో నిండగా
మరణమే దగ్గరై నిలుచుండగా

ఆకాశం నుండి నాకై భువికొచ్చావే
సిలువ మీద రక్తం కార్చి ప్రాణం పెట్టావే
పాపానికి నాకు ఎడమ కలగజేసావే
నసియించే ఆత్మనే రక్షింప చేసావే

ఏ మేలులు మరువకే ప్రాణమా
జీవితకాలం కీర్తించుమా
దేవుని ఏ మేలులు మరువకే ప్రాణమా
జీవితకాలం కీర్తించుమా…

నా దేవా నా దేవా నా జీవితమే మారిందయ్యా
నా దేవా నా దేవా నీ కృపలో నేనుంటానయ్యా.

Oka kshanamaina song lyrics in English

Telugu Christian Songs

Jeba
      Tamil Christians songs book
      Logo