Nee Prema Tyagam song lyrics – నీ ప్రేమ త్యాగం

Deal Score0
Deal Score0

Nee Prema Tyagam song lyrics – నీ ప్రేమ త్యాగం

పల్లవి –

మరువలేనిదీ…. నీ ప్రేమ త్యాగం
విడువలేనిదీ …. నీ ప్రేమ బంధం “2”
మహాదేవుడువు – మహోన్నతుడువు
మాకై నీవు – దీనుడువైనావు
దాసుని రూపములో దిగివచ్చినావు
ఎంత దీనత్వం… శతకోటి స్తోత్రం – [ మరువలేనిదీ ]

చరణం –

నేరమే చేయని – నీ మీద
నేరమే మోపగా..
అవమానమే పరిచి – క్రూరంగా నిన్ను
కొరడాలుతో కొట్టగా..
మేము చేసే – అతిక్రమాలకు నీవు
గాయాలు పొందినావయా
మేము పాపానికి – మా తలదించగ
అదే నీ తలకు..ముళ్ళ కిరీటమై –
భారంగా నీ శిరమును గాయపరిచినా…
జీవ కిరీటము – మేము పొందాలని “2”
ఎంత భాదను నీవు ఓర్చినావు – మా దేవా…
నీవు చూపించిన ప్రేమకు – మేమేమి అర్పించగలమయా…. [ మరువలేనిదీ ]

చరణం –

పాప వ్యసనాలకు – ఘోరంగా మా
బ్రతుకులు బానిసవగా…
శరీర సుఖాలు – మా దేహమును
పాపములో బంధించగా…
నీ దేహం – మా కొరకు ”2”
నీవు బలిచేసి…
పాపానికి నిలయమగు మా దేహం
నీ రక్త దారలో …శుద్ధిచేసి మా దేహం
దేవాలయంగమలచినావయ్యా …..
నీవు మా దేహానికి ఎంత ధన్యతిచ్చావయ్యా …. “2” [ మరువలేనిదీ ]

Maruvalenidi ne prema nee thyagam yesaiah

    Jeba
        Tamil Christians songs book
        Logo