Koniyadabadunu Yehovayandu song lyrics – కొనియాడబడును యెహోవాయందు
Deal Score0
Shop Now: Bible, songs & etc
Koniyadabadunu Yehovayandu song lyrics – కొనియాడబడును యెహోవాయందు
కొనియాడబడును యెహోవాయందు
భయభక్తులు గల వనిత
తనవారికైనా పగవారికైనా
పంచును సమత మమత
- ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు
ప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పు
కలిగిన భార్య ఇంటికే దీపము
సంఘమనే ఆ వధువునకు నిజమైన రూపము - తండ్రివలె ఓదార్చి తల్లివలె సేదదీర్చి
మిత్రునివలె భర్తకు ఎపుడు తోడుగ నిల్చును
దైవజ్ఞానముతో కుటుంబమును నడుపును
రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును - బ్రతుకు దినములన్నియును భర్తకు మేలే చేయును
దీనులకు దరిద్రులకు తన చేయిచాపును
ఆహారమును తానే సిద్దపరచును
ఇంటివారినందరిని కనిపెట్టుచుండును