Akshayuda Naa Priya Yesayya song lyrics – అక్షయుడా నా ప్రియ యేసయ్యా
Akshayuda Naa Priya Yesayya song lyrics – అక్షయుడా నా ప్రియ యేసయ్యా
అక్షయుడా నా ప్రియ యేసయ్యా
నీకే నా అభివందనం
నీవు నాకోసమే తిరిగి వస్తావని
నేను నీసొంతమై కలసిపోదామని
యుగయుగములు నన్నేలుతావని
నీకే నా ఘనస్వాగతం
నీ బలిపీఠమందు పక్షులకు వాసమే దొరికెనే
అవి అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే
నేనేముందును – ఆకాక్షింతును
నీతో ఉండాలనే కల నెరవేరున
నా ప్రియుడా యేసయ్యా చిరకాల ఆశను నెరవేర్చుతావని మదిలో చిరుకోరిక
నీ అరచేతిలో నను చెక్కుకొని మరువలేనంటివే
నీ కనుపాపగా నను చూచుకొని కాచుకున్నావులే
నను రక్షించిన – ప్రాణమర్పించిన
నను స్నేహించిన – నను ముద్రించిన
నా ప్రియుడా యేసయ్యా
పానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయ
నీవు స్థాపించిన ఏ రాజ్యమైన కొదువ లేకుండునే
బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపునే
అది స్థిరమైనదై – క్షేమము నొందునే
నీ మహిమాత్మతో – నెమ్మది పొందునే
నా ప్రియుడా యేసయ్యా
రాజ్యాలనేలే శకపురుషుడ నీకు సాటేవ్వరు