Sahayam Chese Chethulu – సహాయం చేయకపోతే
Sahayam Chese Chethulu – సహాయం చేయకపోతే
క్రైస్తవుడే ఒక క్రైస్తవుడికి సహాయం చేయకపోతే “2”
సహాయం ఎక్కుడ నుండి వచ్చును
ఉపాయం ఎక్కడ నుండి వచ్చును “2” ” క్రైస్తవుడే”
1.నిన్నువలె పొరుగువారిని ప్రేమించమన్నారు
అనుభవములో దాని యొక్క అర్థమే మరిచారు “2”
క్రీస్తుయేసు సిలువలో చూపిన అమూల్య ప్రేమ “2”
మరువకుండా విడవకుండా ప్రేమకలిగి ఉండుమా. “2” “క్రైస్తవుడే”
2.క్రైస్తవుడు ఉప్పువలె ఉండాలని అన్నారు
అనుభవములో దానియొక్క అర్థమే మరిచారు “2”
రుచినిచ్చు ఉప్పులాంటి క్రైస్తవుని భాద్యతగా “2”
సర్వలోకమంతా సువార్త రుచిని తెలుపుమా “2” ” క్రైస్తవుడే”
3.క్రిస్తుయేసుకు కలిగిన మనస్సు ఉండాలని ఆన్నారు అనుభవములో దానియొక్క అర్థమే మరిచారు “2”
ప్రభుయేసులాంటి మనస్సు కలిగివున్న ప్రతివారిలో “2”
పరలోక అనుభవాలు కలిగి జీవించేదరు. “2′ “క్రైస్తవుడే”
Sahayam Chese Chethulu Kraisthavude Oka Kraisthavuniki Sahayam Cheyakapothe