నాకింత భాగ్యమా – Nakintha Bhagyama
నాకింత భాగ్యమా – Nakintha Bhagyama
“ప” తండ్రి నిను స్తుతించుటకు
నాకింత భాగ్యమా
దేవా నిను పాడుటకు
ఈ స్వరమే నీ వరమా (2)
ఎన్నో మేళ్ళు నాకై చేస్తు.
అణు నిత్యంతోడుగావుంటూ (2)
నా చెలిమినే కొరితివా
నీ ప్రేమతో దీవించితివా(2) “తండ్రి “
“చ” కలిమైన లేమైనా నా చేంతనే నిలిచి
ప్రాణంగ ప్రేమించి నన్ను పోషించి (2)
నా భారమంతా నీవు మోసినావ
నీ కృపతో నా పాత్రను దీవించినావ(2)
నను కోరిన నజరేయ
నాతో నడిచే ప్రేమామయ (2) “తండ్రి “
“చ ” ఎవరున్న లేకున్న నాకంటు నువు వుంటే
చాలయ్య నా బ్రతుకు ధన్యము ఈ దినము (2)
నీతోనే నడిచేద నా జీవితకాలం
నీకై నే చేసేద స్తుతి స్తోత్రగానం (2)
నను నిలుపుమయా నీ సన్నిధి చాలయ్య(2)
"తండ్రి "