నా ప్రాణమా కలవరమే వద్దు – Naa Pranama Kalavarame Vaddu
నా ప్రాణమా కలవరమే వద్దు – Naa Pranama Kalavarame Vaddu
నా ప్రాణమా కలవరమే వద్దు
నీ గతం తలంచుచు నీవు
శోదింపబడుచున్న నీవు-సువర్ణమై మారుకాలం
రానైయున్నదని నిరీక్షించి చూడు (2)
ఎందుకీ వేదన ఎంతకాలం ఈ రోదనా
వాగ్దానము చేసిన దేవుడే నిను దాటిపోడెన్నాడు
నీ పితరుల దేవుడే నీకు.. తోడు
నిను విడివడు నిను మరువడు ఇదియే సత్యము
ఆలస్యం అవుతుందని చింతించకు
నూరంతల దీవెన నీకై సిద్ధపరచబడెను
చిత్తము జరిగించుము అని ప్రార్థించు
కాలాలు సమయాలు యేసయ్యవేగా (2)
అక్కరలన్నీ తీర్చును ధైర్యముగా నిలుచును
తగిన కాలమందు విడువక నిన్నే హెచ్చించును
శ్రమలోను స్తుతియించు విశ్వసించి ప్రార్ధించు
నను ఘనపరచువాని ఘనపరతునని వాగ్దానము స్మరియించు
మారాను మధురముగా మార్చినా దేవుడే
నీ స్థితిని మార్చును ఇదియే సత్యము
నీ పితరుల దేవుడే నీకు.. తోడై వాగ్దానములన్నీ నెరవేర్చును ఇదియే సత్యం