సిలువలోని విలువనెరిగి – Siluvaloni viluvanerigi

Deal Score0
Deal Score0

సిలువలోని విలువనెరిగి – Siluvaloni viluvanerigi

సిలువలోని విలువనెరిగి జీవింపనేర్పుమా
శ్రమలలోను సడలిపోని జయజీవితమీయుమా-2
నీ సువాసనగా మమ్ము పరిమళింపచేయుమా-2

చరణం:1
ఆత్మలో దీనత్వము సాత్వీకమునునేర్పుమా
పొరుగువారిని ప్రేమతో ఓదార్చు ఓర్పును కూర్చుమా-2
నీతిక్రియలను చేయగా మాలో ఆకలినుంచుమా-2
సమాధానము పంచు నీ కుమారులనుగా పెంచుమా
॥సిలువ॥

చరణం:2
ప్రాణమును అతి ప్రియముగా ప్రేమింపకుండుట నేర్పుమా
ప్రియులని లోకస్తులన్ మది తలచుటను మాన్పింపుమా -2
నీ ప్రేమ త్యాగము ప్రకటించు భారము పెంచుమా-2
నీ కొరకు నిందలు హింసలు భరించు భాగ్యము నీయుమా .॥సిలువ॥

Jeba
      Tamil Christians songs book
      Logo