విడువని నా స్నేహమా – Thanks Giving Song
విడువని నా స్నేహమా – Thanks Giving Song
నా ప్రాణ ప్రియుడా వందనాలయ్యా
కృప చూపితివి నీకు స్తోత్రమేసయ్యా
సమీపించని తేజస్సులో నివసించువాడా నా దైవమా
సకాలములో స్పందించని నా మీదనా ఇంతటి ప్రేమ
నా ఆధారమా నా ఆశ్రయమా
ఎన్నడు విడువని నా స్నేహమా
పాతాళవశము కాకుండగా తప్పించుకొనగలవారెవ్వరు?
విమోచకుడవు సజీవుడవు – నా జీవాన్ని నీ యందు దాచియుంచావు
నీ సెలవు లేక ఆహారముతో సంతృప్తి చెందగలవారెవ్వరు?
పోషకుడవు సంరక్షకుడవు – సమృద్ధితో నన్ను నింపుచున్నావు
నీవు కార్యము చేయగా త్రిప్పివేయగలిగినవారెవ్వరు?
బలవంతుడవు సృష్టికర్తవు – నా కార్యములన్నీ నెరవేర్చుచున్నావు