పల్లవి: జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును “2”
నన్ను ప్రేమించినా – ప్రియ యేసు కొరకే
నాకై ప్రాణమిచ్చినా – ప్రభు యేసు కొరకే
జీవింతునూ…జీవింతునూ…జీవింతునూ…జీవింతునూ… “2”
1. నీ ఉన్నత పిలుకు లోబడదున్ గురివైపునకే – బహుమానము పొందగ పరుగిడుదున్
వెనుకవున్నవన్నీ మరతునూ ముందున్నవాటి కొరకే నే వెగిరపడుదును “2”
నన్ను ప్రేమించినా యేసునీ చుతును – నాకై ప్రాణమిచ్చిన – ప్రభుని వెంబడింతునూ
గురువైపుకే – పరిగెడుదునూ వెనుదిరుగను – వెనుదిరుగను “2”
“జీవింతు నేను”
2. శ్రమయైనా బాధైననూ హింసయైనా – కరువైనా ఎదురైనను
ఉన్నవైన రాబొవునవైన అధికారులైనా – ఎతైనా లోతైనను “2”
నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి – నేను విడిపోదునా ప్రభు నీడనుండి
జీవింతునూ నా యేసుతో – జయమిచ్చునూ నా యేసుడే “2”
“జీవింతు నేను”