యేసయ్య ప్రేమానురాగము – YESAYYA PREMANURAAGAMU NITHYA
యేసయ్య ప్రేమానురాగము – YESAYYA PREMANURAAGAMU NITHYA
Lyrics:
నీ కృప కనికరం మెండుగా కురిపించినావు
నీ దయ క్షేమము ఎన్నడు నను వీడలేదు
యేసయ్యా నీ ప్రేమానురాగము – కుమ్మరించెను వాగ్దాన వర్షము
మరువలేను క్షణమైనను – నిన్ను పొందుట నా భాగ్యము
1. భారమైన శ్రమలలో నా వల్ల కాదనుకొనగా
నిజముకాని నిందలన్ని దీవెనలుగా మార్చినావు
నీ సన్నిధిలో నా దీనప్రార్ధన – మనవులు ఎన్నడు కాదనలేదే
మరువలేని ఆదరనిచ్చి ఓదార్చిన నా కన్నతండ్రివి పరమతండ్రివి
2. దివ్యమైన రాజ్యమునకు వారసునిగా మారాలని
హేయమైన మనుజాశలను ఆత్మశక్తితో ఎదురింతును
సిద్ధపరచిన బహుమానము – జయించినవారికే సొంతము
మాటతప్పని మహనీయుడా – మారదు ఎన్నడు నిబంధన –
నీ నిత్యనిబంధన
3. రక్షించితివి నీ దూతనంపి మరణఅంచులనుండి
జీవించెదను నమ్మకముగా ప్రాణమున్నంతవరకు
గళమెత్తి పాడెద నీ శౌర్యము – ప్రచురపరతును నీ కార్యము
ఆసన్నము నీ ఆగమనము – నిన్ను చేరుట నా గమ్యము – నా జీవితగమ్యము