ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ పరుగులు – Ennaallu Ennaallu Lyrics

Deal Score+1
Deal Score+1

ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ పరుగులు – Ennaallu Ennaallu Lyrics

ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ పరుగులు
ఓ క్షణము తీరికైన లేని ఉరుకులు
ఈ లోక ధనమును అధికార బలమును
ఈ లోక ఘనతలు శరీర సుఖములు
వెతుకుచుంటే దొరుకు నలసటే

1.నీ కలలు కోరికలకు అంతమంటూ ఉండదు
నీవెన్ని పోందుకున్నను సంతృప్తి మిగలదు
ఊహించినట్లు సిరులు నీకు సుఖములివ్వవు
ఈలోక భోగ మంతము నిరాశ మాత్రమే

ఈ లోకమంతయు నీ సొంతమైనను
నీ హృదిలో మాత్రము ఓ లోటు ఉండును
ఆ లోటు యేసుతోనే తీరును

2.అనిత్యమైన వాటి వెనుక పరుగు వ్యర్ధము
నిత్యుడైన యేసు వైపు నేడే తిరుగుము
యేసు నిత్య జీవము నీకివ్వ వలెనని
సిలువ పైన మరణమొంది తిరిగి లేచెను

యేసు ప్రభువని అంగీకరించితే
పరిశుద్ధాత్ముడు నీ హృదిలో చేరును
ఆ హృదిలో వెలితి ఏల ఉండును

 

    Jeba
        Tamil Christians songs book
        Logo